కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో టీబీ లక్షణాలు..!

డయాబెటీస్ కు ప్రధాన కారణం స్థూలకాయం అనే చెప్పాలి. అధిక బరువు లేదా ఊబకాయం వల్ల టైప్-2 డయాబెటీస్ ప్రీ-డయాబెటీస్ వేగంగా పెరుగుతుంది. అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ప్రీ డయాబెటీస్, పూర్తి స్థాయి డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. దీని కోసం శరారీక శ్రమను పెంచడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొంత బరువు తగ్గడం చేయాల్సి ఉంటుంది. మనం డయాబెటీస్ కోసం మొదటి స్క్రీనింగ్ ను 35 ఏళ్లలో ప్రారంభించాలి..

అయితే కరోనా నుంచి కోలుకున్న కొంత మందిలో టీబీ(క్షయ) లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 155 మందిలో టీబీ లక్షణాలు గుర్తించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో మిగతా వారిని అధికారులు అప్రమత్తం చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో టీబీ లక్షణాలు ఉంటే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 

టీబీ లక్షణాలున్న వారిని గుర్తించేందుకు రాష్ట్రంలో డోర్ టు డోర్ సర్వే నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ నుంచి కోలుకున్న 6,02,887 మందిని సర్వేచేశారు. 24,598 మందిలో టీబీ లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం 104 మంది టీబీ బారిన పడినట్లు తేలింది. కోవిడ్ బాధిత వ్యక్తుల కుటుంబ సభ్యులను పరీక్షించగా 8,523 మందిలో లక్షణాలు గుర్తించగా, వీరిలో 51 మందిలో టీబీ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. 

Leave a Comment