8 మంది భర్తలను మోసగించి మరో పెళ్లికి సిద్ధమైంది..!

108
Fraud Marriages

పెళ్లి కాని యువకుడు, విడాకులు తీసుకున్న వారే ఆమె టార్గెట్..వారిని వెతికి మరీ పెళ్లి చేసుకుంటుంది.. పెళ్లి చేసుకుని కొన్ని రోజులకే ఏదో ఒక సాకుతో విడాకులు తీసుకుంటుంది. అంతేకాదు విడాకులు తీసుకున్నాక భారీ ఎత్తున భరణం చెల్లించుకుని ఉడాయిస్తుంది. ఇలా ఏకంగా 8 మందిని భర్తలను మోసం చేసిన మహిళ ఉదంంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ఎనిమిది భర్తలకు             మరో తలనొప్పి వచ్చిపడింది. ఆ మహిళకు ఎయిడ్స్ నిర్ధారణ అయింది. దీంతో తమకు కూడా సోకిందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. 

వివరాల మేరకు హరియాణా రాష్ట్రం కైతల్ జిల్లాకు చెందిన మహిళ 2010లో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల తర్వాత ఆమె భర్త కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. బతుకుదెరువు కోసం మోసాల చేయడం ప్రారంభించింది. వివాహం కాని వారు, విడాకులు తీసుకున్న వారినే టార్గెట్ చేసింది. 

ఆమె తన తల్లితో కలిసి వారిని మాటల్లో దింపుతుంది. తర్వాత వారితో నిరాడంబరంగా పెళ్లి చేసుకుని వారితో కాపురం పెడుతుంది. పెళ్లయిన పది రోజులకే ఏదో ఒక కారణంతో భర్తతో గొడవ పెట్టుకుంటుంది. తర్వాత అతనితో విడాకులు కోరుతంది. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. భయంతో వారు ఎంతో కొంత భరణం ఇచ్చేసి విడాకులు తీసుకుంటారు. ఇలా ఏకంగా 8 మందిని ఆ మహిళ పెళ్లి చేసుకుంది. ఈ విధంగా చేసి లక్షల రూపాయలు సంపాదించింది.

ఇలా చేస్తుండటంతో గతంలో కొంత మంది భర్తలు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇక తొమ్మిదో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినప్పుడు పోలీసులు ప్రత్యక్షమయ్యారు. ఆ పెళ్లిని ఆపేసి ఆమెను స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడే ఓ ట్వీస్ట్ మొదలైంది. వైద్య పరీక్షల్లో ఆమెకు ఎయిడ్స్ సోకిందని నిర్ధారణ అయింది. ఈ విషయం తెలుసుకున్న ఆ 8 మంది భర్తలు షాక్ అయ్యారు. తమకు ఎక్కడ సోకిందేమోనని ఆ మాజీ భర్తలు టెన్షన్ పడుతున్నారు. వారికి కూడా పోలీసులు పరీక్షలు నిర్వహించనున్నారు. 

Previous articleకోవిడ్ నుంచి కోలుకున్న వారిలో టీబీ లక్షణాలు..!
Next article‘రాజమౌళి నన్ను అసహ్యంగా ఉన్నావు అన్నారు’.. ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here