ప్రముఖ రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్-5 త్వరలోనే ప్రారంభంకానుంది. బిగ్ బాస్ 5 సీజన్ కి సంబంధించిన ప్రతి అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సీజన్ కంటెస్టెంట్స్ వీరే అంటూ ఇప్పటికే పలువురు టీవీ నటీనటులు, యాంకర్లు, యూట్యూబ్ స్టార్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా మరో కొత్త జాబితా బయటకు వచ్చింది. ఈ జాబితాలో కొంతమంది కొత్త వాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ కొత్త జాబితాలో యాంకర్ రవి, ఆర్ జే కాజల్, శ్వేతా వర్మ, లహరి షారి, కమెడియన్ లోబో, సిరి హన్మంతు, నటి ప్రియ, కార్తీకదీపం ఉమాదేవి, 7 ఆర్ట్స్ సరయు, నటుడు మానస్ షా, మోడల్ జస్వంత్, నటుడు సన్నీ, విశ్వ, టీవీ9 యాంకర్ ప్రత్యూష, ఆట సందీప్ లేదా రఘు మాస్టర్ వీరి పేర్లు ఉన్నాయి.
అంతకుముందు వచ్చిన జాబితాలో యాంకర్ వర్షిణీ, ట్రాన్స్ జెండర్ ప్రియాంక, యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్, యానీ మాస్టర్, యూట్యూబర్ నిఖిల్ ల పేర్లు ఉండగా.. ఈ కొత్త జాబితాలో వారి పేర్లు లేకపోవడం గమనార్హం.. దీంతో ఈ సారి బిగ్ బాస్ సీజన్ 5 హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చేది వీరే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా సెప్టెంబర్ లో ఈ సీజన్ ప్రారంభం కానుంది.
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ కొత్త జాబితా:
- యాంకర్ రవి
- ఆర్ జే కాజల్
- శ్వేతా వర్మ
- లహరి షారి
- కమెడియన్ లోబో
- సిరి హన్మంతు
- నటి ప్రియ
- కార్తీకదీపం ఉమాదేవి
- 7 ఆర్ట్స్ సరయు
- నటుడు మానస్ షా
- మోడల్ జస్వంత్
- నటుడు సన్నీ
- విశ్వ
- టీవీ9 యాంకర్ ప్రత్యూష
- ఆట సందీప్