మహిళల పట్ల తాలిబన్ల రూల్స్ ఎలా ఉంటాయో తెలుసా?

అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల కబంద హస్తాల్లోకి వెళ్లిపోయింది. దీంతో వారి అరాచాకం మొదలైనట్లే.. తాలిబన్ల అరాచకం ఎలా ఉండబోతుందోనని అఫ్ఘాన్ మహిళలు వణికిపోతున్నారు. తాలిబన్ల పాలనలో అక్కడి మహిళల జీవితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే తాలిబన్ల రూల్స్ అంత కఠినంగా ఉంటాయి. ఇకపై అఫ్ఘనిస్తాన్ రాతియుగం నాటి పాలన చూస్తుంది. 

అఫ్ఘాన్ మహిళలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటారనే వార్తలు ఇప్పటికే వచ్చేస్తున్నాయి. వయసులో ఉన్న ఆడపిల్లలు, వితంతువులు తాలిబన్లను పెళ్లిచేసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఇటీవలే వార్తలొచ్చాయి. 2001లో అఫ్ఘాన్ లో తాలిబన్ల ప్రభుత్వం కూలిపోయింది. అమెరికా మద్దతుతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి 20 ఏళ్లుగా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న మహిళలు ఇప్పుడు మళ్లీ అదే జీవితంలోకి వెళ్లబోతున్నారు. 

మహిళలు బుర్ఖాలు ధరించాలి.. పురుషులు గడ్డాలు పెంచాలి లాంటి చిన్న చిన్న రూల్స్ ను కూడా తాలిబన్లు వదిలిపెట్టరు. ఒకవేళ పాటించకుంటే ప్రాణాలతో విడిచిపెట్టరు. 10 ఏళ్లు దాటిన బాలికలు చదువుకోవడానికి వీల్లేదని బాలికల విద్యపై ఆంక్షలు. సంగీతం, టీవీ, సినిమాల వంటి వినోద కార్యక్రమాలపై నిషేధం ఉంటుంది. 

తాలిబన్లు రూల్స్ ఇవే..

  • మహిళలు మోకాళ్లు కనిపించేలా దుస్తులు వేయడం నిషేధం.
  • ఆడపిల్లలకు చదువు నిషిద్ధం.
  • తండ్రి, భర్త, సోదరుడు తోడులేకుండా బయటికి వస్తే కఠిన శిక్షలు ఉంటాయి. 
  • ఇళ్ల ముందు గానీ, బాల్కనీల్లో గాని అస్సులు నిలబడకూడదు.
  • ఎలాంటి పరిస్థితుల్లోనైనా మగ డాక్లర్ల దగ్గరకు వెళ్లకూడదు. 
  • హై హీల్స్, టైట్ జీన్స్ వేసుకోకూడదు.
  • రేడియో, టీవీ, పబ్లిక్ ప్రోగ్రామ్స్ కు దూరంగా ఉండాలి.
  • సైకిళ్ల మీద తిరగొద్దు..

 

Leave a Comment