లార్డ్స్ లో టీమిండియా చారిత్రక విజయం..!

ఇంగ్లంతో లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 151 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. చివరి రోజు భారత పేసర్లు చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోయారు. దీంతో రూట్ సేన సెకండ్ ఇన్నింగ్స్ లో 120 పరుగులకే కుప్పకూలింది. 

ఐదో రోజు ఆట ఆరంభించిన భారత్ సెకండ్ ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది డిక్లేర్ చేసింది. దీంతో భారత్ కు 271 పరుగుల ఆధిక్యం లభించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత టెయిలెండర్లు అదరగొట్టారు. షమీ(56)తో అదరగొట్టగా, బుమ్రా(34) అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. 

272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ను భారత బౌలర్లు హడలెత్తించారు. దీంతో 120 పరుగులకే ఇంగ్లండ్ టీమ్ చేతులెత్తేసింది. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు, బుమ్రా 3 వికెట్లు తీయగా, ఇషాంత్ 2, షమీ ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ లలో రూట్(33)తో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది. 

Leave a Comment