ఆంధ్రప్రదేశ్ కో- ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(ఆప్కాబ్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడలోని బ్రాంచీలో మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీలు : 61
పోస్టుల వివరాలు : మేనేజర్(స్కేల్-1) – 26, స్టాఫ్ అసిస్టెంట్ – 35
మేనేజర్(స్కేల్-1): అభ్యర్థులు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెబర్నరీ, ఫిషరీస్ విభాగాల్లో 40 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయస్సు: 01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టాఫ్ అసిస్టెంట్లు: అభ్యర్థులు 40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్ నాలెడ్స్ ఉండాలి.
వయస్సు: 01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు:
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులను ఆన్ లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది 05.08.2021
- 2021 సెప్టెంబర్ మొదటి వారంలో ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
పూర్తి వివరాలకు : https://www.apcob.org/