మీ పర్మిషన్ లేకుండా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తున్నారా? అయితే ఇలా చేయండి..!

మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, కోలీగ్స్ ఇలా ప్రతి ఒక్కరితో టచ్ లో ఉండేందుకు చాలా మంది వాట్సాప్ లో గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటారు. వారితో రెగ్యులర్ గా టచ్ లో ఉండేందుకు ఈ గ్రూప్స్ ఉపయోగపడతాయి. అయితే మీ పర్మిషన్ లేకుండా కొన్ని గ్రూప్ లలో  మిమ్మల్ని యాడ్ చేస్తుంటారు. అవి మీకు ఇబ్బందికరంగా మారొచ్చు. 

అయితే వాట్సాప్ లో చిన్న సెట్టింగ్స్ చేసుకుంటే చాలు.. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ లో ఎవరూ యాడ్ చేయలేరు. దాని కోసం సెట్టింగ్స్ ఎలా చేయాలి తెలుసుకోండి..

Use these settings to avoid adding to WhatsApp groups without your permission

  • వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత కుడి వైపున త్రీడాట్స్ కనిపిస్తాయి. అక్కడ క్లిక్ చేయాలి. 
  • ఆ తర్వాత Settings ఓపెన్ చేయండి.
  • అక్కడ Account మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత Privacy పైన క్లిక్ చేయాలి. అక్కడ Groups ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. 
  • అక్కడ మీకు Every one, My Contacts, My Contacts except, Nobody అనే ఆప్షన్లు ఉంటాయి. 
  • Every one – సెలెక్ట్ చేస్తే మిమ్మల్ని గ్రూప్ లో ఎవరైనా యాడ్ చేయవచ్చు.
  • My Contacts – సెలెక్ట్ చేస్తే మీ కాంటాక్ట్ లో ఉన్న వారు మాత్రమే గ్రూప్ లో యాడ్ చేయగలరు. 
  •  My Contacts except – మీ కాంటాక్ట్స్ లో కొందరు మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేయకుండా చేయగలరు. మీరు సెలెక్ట్ చేసిన కాంటాక్ట్ వారు మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేయలేరు. 
  • Nobody – సెలెక్ట్ చేస్తే మిమ్మల్ని గ్రూపులో ఎవరూ కూడా యాడ్ చేయలేరు. 
  • ఒక వేళ మీరు ఎదైన గ్రూపులో యాడ్ కావాలనుకుంటే ఆ గ్రూప్ అడ్మిన్ కు మీ నెంబర్ యాడ్ చేయమని చెప్పాలి. మీకు ఇన్విటేషన్ లింక్ వస్తుంది. దాన్ని యాక్టివ్ చేస్తే గ్రూప్ లో యాడ్ అవుతారు. చేరకూడదు అనుకుంటే యాక్టివ్ చేయకుంటే చాలు ఆ లింక్ మూడు రోజుల్లో ఎక్స్ పైర్ అవుతుంది. 

 

 

Leave a Comment