‘నన్న టచ్ చేసినందుకు సంతోషంగా ఉంది’.. బాలయ్య కొట్టడంపై స్పందించిన అభిమాని..

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరు బాలకృష్ణ మరో సారి తన మార్క్ కోపాన్ని చూపించారు. తన అనుమతి లేకుండా వీడియో తీసినందుకు టీడీపీ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హిందూపురంలోని 9వ వార్డులో ఓ ఇంట్లోకి బాలయ్య వెళ్లారు. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్త ప్రచారం వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో బాలయ్య కోపంతో తన అనుమతి లేకుండా వీడియో తీస్తావా అంటూ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. 

బాలయ్య కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలయ్య చేతిలో దెబ్బలు తిన్న అభిమాని సోము ఈ వీడియోపై స్పందించారు. ‘బాలయ్య నాకేం బాధలేదు. ఆయన టచ్ చేసినందుకు గర్వంగా ఉంది. ప్రచారంలో బాలయ్య ఎవరికీ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వరు. అలాంటిది నన్ను టచ్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా అన్నయ్య ఇంటికి వచ్చిన బాలయ్య.. నన్ను బయటి వ్యక్తి అనుకుని పక్కకు తోశారు. ఇలాంటి వాటిని మేము పట్టించుకోము. అని ఓ వీడియో రిలీజ్ చేశాడు.   

 

Leave a Comment