బాలకృష్ణ ఆటలో అరటి పండు : కొడాలి నాని

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చంద్రబాబు, బాలకృష్ణపై విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దెబ్బకు చంద్రబాబు చిన్ని మెదుడు చితికిపోయిందని అన్నారు. చంద్రబాబు శనిగ్రహం అని, ఈ విషయాన్ని స్వర్గీయ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తుచేశారు. 

విశాఖ ఉక్కు విషయంలోె మోడీని ప్రశ్నించే దమ్ము చంద్రబాబుకు లేదని కొడాలి నాని అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆటలో అరటి పండులాంటి వ్యక్తి అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులు బాలకృష్ణకు తెలియవన్నారు. షూటింగ్ ల నిమిత్తం బాలకృష్ణ ఇతర దేశాలు, రాష్ట్రాలు తిరుగుతున్నారని, చంద్రబాబు స్క్రిప్టునే బాలకృష్ణ చదువుతున్నారని విమర్శించారు. 

 

Leave a Comment