అభినిని కొట్టిన బాలయ్య..!

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరు బాలకృష్ణ మరో సారి తన అభిమానిపై చేయి చేసుకున్నారు. తన అనుమతి లేకుండా వీడియో తీసినందుకు చెంప చెళ్లుమనిపించారు. హిందూపురం ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హిందూపురంలోని 9వ వార్డులో ఓ ఇంట్లోకి బాలయ్య వెళ్లారు. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్త ప్రచారం వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. ఇక అంతే బాలయ్యకు చిర్రెత్తింది. కోపంతో తన అనుమతి లేకుండా వీడియో తీస్తావా అంటూ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. పర్సనల్ గా మాట్లాడుతుంటే వీడియో తీస్తావా, వెంటనే డిలీట్ చేయ్ అంటూ మండిపడ్డారు. దీంతో అక్కడున్న వాళ్లంత హడలెత్తిపోయారు. 

 

Leave a Comment