కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసుకోండి..!

How to do Corona Vaccine Registration

కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ప్రారంభమైన మొదటి రోజే 25 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కరోనా టీకా కోసం cowin.gov.in పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని అపాయింట్ మెంట్ పొందాల్సి ఉంటుంది. పోర్టల్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచి అయినా, ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. టీకా తీసుకునే సమయం వరకు లబ్ధిదారులు పోర్ట్ లో నమోదు చేసిన వివరాల్లో మార్పులు చేసుకోవచ్చు. టీకా తీసుకున్న తర్వాత రికార్డు మొత్తం లాక్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం ఏంచేయాలంటే..

కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం..

Corona Vaccine Registration Process

  • ముందుగా  cowin.gov.in పోర్టల్ లోకి వెళ్లాలి. 
  • అక్కడ Register Yourself అప్షన్ ను క్లిక్ చేయాలి. 
  • అప్పుడు వేరే పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. 
  • ఫోన్ కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వెరిఫై బటన్ పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ పేజీలోకి ప్రవేశిస్తారు. 
  • అక్కడ మీ పేరు, వయసు వంటి వివరాలు నమోదు చేయాలి. ఏదైనా ఒక గుర్తింపు కార్డును అప్ లోడ్ చేయాలి. 
  • ఒకవేళ 45 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉండి, వ్యాధులతో బాధపడుతూ ఉంటే గుర్తింపు కార్డుతో పాటు ఆర్ఎంసీ సంతకం చేసిన సంబంధిత ధ్రువపత్రాన్ని కూడా అప్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ బటన్ నొక్కాలి. 
  • అక్కడ అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. 
  • ఒకవేళ మీరు ఒకరి కంటే ఎక్కువ మందిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ‘యాడ్ మోర్’ ఆప్షన్ ఎంచుకోవాలి. వారి వివరాలు నమోదు చేయాలి. గరిష్టంగా నలుగురిని యాడ్ చేసుకోవచ్చు. 
  • తర్వాత షెడ్యూల్ అపాయింట్ మెంట్ బటన్ నొక్కాలి. 
  • రాష్ట్రాలు, జిల్లాల వారీగా టీకా అందజేసే వ్యాక్సినేషన్ కేంద్రాల సమాచారం ఉంటుంది. ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న స్లాట్లు తేదీలు, సమయం వారీగా కనిపిస్తాయి. 
  • ఒక స్లాట్ ను ఎంచుకొని ‘బుక్’ బటన్ పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వ్యాక్సినేషన్ అపాయింట్ మెంట్ తో కూడిన మెసేజ్ మీ మొబైల్ కు వస్తుంది. 

 

Leave a Comment