నీ అరటి పండు కంటే నాదే పెద్దది..!

ఇటీవల ఓ అరటి పండు వార్త షోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంగ్లండ్ లో పౌలా అనే మహిళ మార్కెట్ లో దాదాపు 12 అంగుళాలు ఉన్న అరటి పండును కొనుగోలు చేసింది. ఆ విషయాన్ని పౌలా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రపంచంలో ఇదే పొడవైన అరటి పండు అని పౌలా చెప్పుకొచ్చింది. ఆ అరటి పండు ఫొటోలను కూడా షేర్ చేసింది. 

అయితే తన అరటి పండు పౌలా అరటి పండు కంటే పెద్దదని మిక్ బ్రౌన్ స్టేక్స్ అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఆమె అరటి పండు 12 అంగుళాలలే అని, తన అరటి పండు 14 అంగుళాలు ఉందని తెలిపాడు. అంతే కాదు ఆ అరటి పండును టేప్ తో కొలిచి మరీ చూపించాడు. బ్రిటన్ లో ఇదే అతి పెద్ద అరటి పండు అని చెప్పాడు. కాగా పౌలా, మిక్ ఇద్దరూ నాదే పొడవైన అరడి పండు అంటే కాదు.. నాది నీకన్నా పొడవైనదని వాదించుకుంటున్నారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.   

 

Leave a Comment