షూటింగ్ లో పేలిన పెట్రోల్ బాంబు..ప్రముఖ హీరోకు గాయాలు..!

ప్రముఖ కన్నడు నటుడు రిషబ్ శెట్టికి గాయాలయ్యాయి. కన్నడ సినిమా షూటింగ్ లో పెట్రోల్ బాంబు పేలడంతో హీరో రిషబ్ గాయపడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల హాసన్ జిల్లా బేలూరులో ‘హీరో’ సినిమా యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. 

స్క్రిప్ట్ లో భాగంగా హీరో రిషబ్ తో పాటు మరో నటుడు లక్ష్మణ్ పెట్రో బాంబులు విసిరి పారిపోవాల్సి ఉంటుంది. అయితే బాంబు విసిరి పరిగెత్తే లోపు పెట్రో బాంబులు పేలాయి. ఆ మంటల్లో హీరో రిషబ్ తో పాటు మరో నటుడికి గాయాలయ్యాయి. ఈ పెట్రో బాంబు ఘటన కన్నడ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.  

Leave a Comment