ప్రతి గ్రామానికి అన్ లిమిటెడ్ ఇంటర్నెట్..!

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. గ్రామాలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ నెట్ వర్క్ అందించాలని, అంతరాయం లేకుండా ఇంటర్నెట్ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు. శుక్రవారం ఐటీ, డిజిటల్ టెక్నాలజీపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అంతరాయాలు లేకుండా ఇంటర్నెట్ నెట్ వర్క్ అందించాలన్నారు. ఏ స్థాయి కనెక్షన్ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. గ్రామంలో నెట్ వర్క్ పాయింట్ వద్ద ఇంటర్నెట్ లైబ్రరీ ఉండాలన్నారు. తద్వారా సొంత ఊళ్లలోనే వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించవచ్చని, ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. 

 

Leave a Comment