ఆ సమయంలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేయకండి..!

యూపీఐ ప్లాట్ ఫాం ద్వారా డిజిటల్ పేమెంట్స్(UPI Payments) వినియోగదారులకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)(NCPI) ఒక సూచన చేసింది. రాబోయే కొద్ది రోజుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యూపీఐ) అప్ డేట్ అవుతుందని పేర్కొంది. ఈ అప్ గ్రేడెషన్ ప్రక్రియ రాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకు ఉంటుందని తెలిపింది. 

అప్ గ్రేడెషన్ జరిగే ఈ సమయంలో ఎవరూ కూడా యూపీఐ ద్వారా లావాదేవీలు జరపవద్దని ఎన్సీపీఐ(National Payment Corporation of India) సూచించింది. అయితే అది ఎన్ని రోజులు అనేది ఎన్పీసీఐ పేర్కొనలేదు. కేవలం రాబోయే కొద్ది రోజులు అని మాత్రమే పేర్కొంది. ఎవరైనా ఎన్సీపీఐ పేర్కొన్న సమయంలో పేమెంట్స్ చేస్తే వినియోగదారులు అసౌకర్యానికి గురికావచ్చు. ఎన్సీపీఐ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 

Leave a Comment