‘ఈ వృద్ధ దంపతుల కన్నీళ్లు తుడిచివేయండి’.. సోషల్ మీడియాను కదిలిస్తున్న ఈ దంపతుల పరిస్థితి..!

దేశ రాజధానిలో 80 ఏళ్ల వృద్ధుడు ఇతరులపై ఆధారపడకుండా సొంత రెక్కల కష్టంతో బతుకుతున్న తీరు నెటిజన్లను కదిలిస్తోంది. ఢిల్లీ మాళవీయ నగర్ లో చిన్న కొట్టులో భార్యతో కలిసి ‘Baba ka Dhaba’ పేరుతో రకరకాల వంటకాలు అమ్ముతుంటాడు..30 ఏళ్లుగా ఇదే పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే కరోనా వీరిని కబళించింది. కరోనా రాకముందు గిరాకీ బాగానే ఉండేది. కానీ కరోనా తర్వాత గిరాకీ లేక.. కుటుంబం గడవక.. కష్టాలు పడుతున్నారు.

ఇటీవల ఓ యూట్యూబర్  Baba ka Dhaba ను సందర్శించాడు. వారిని వ్యాపారం ఎలా జరుగుతుందని అడిగాడు. ఇక అంతే ఆ పెద్దాయన కన్నీళ్లు పెట్టేశాడు. గల్ల పెట్టెలో నుంచి రూ.10 మాత్రమే తీసి చూపించాడు. నాలుగు గంటల్లో కేవలం రూ.50 మాత్రమే వచ్చాయన్నాడు. ఆ యూట్యూబర్ తన వ్లాగ్ లో  Baba ka Dhaba లోని వంటకాలను చూపించాడు. ఇంత మంచి క్వాలిటీ ఫుడ్ స్టార్ హోటల్ లో కూడా దొరకడు అని చెప్పారు. అనంతరం దేవుడు చల్లాగా చూస్తాడు అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

ఆ తర్వాత ఆ వీడియోను వసుంధర శర్మ అనే మహిళ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘ఈ వీడియో చూసి నా గుండె పగిలింది. ఢిల్లీ వాలో దయచేసి Baba ka Dhaba కు వెళ్లి భోజనం చేయండి’ అని ట్వీట్ చేసింది. అంతే ఈ ట్వీట్ ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. ఇప్పటి వరకు 22 లక్షల మందికిపైగా వీక్షించారు. ఇక ఈ వీడియో చూసిన చాలా మంది మాళవీయనగర్ లో బాబా దాబాకు వెళ్లి భోజనం చేస్తున్నారు. డాబాలో లభ్యమయ్యే భోజనం, చపాతీలకు ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో ఆ తాత పెదవులపై నవ్వు వచ్చింది. 

ఈ వృద్ధ దంపతులను ఆదుకునేందుకు ఎంతో మంది ప్రముఖులు ముందుకు వచ్చారు. రవీనా టండన్, రణదీప్ హుడా, స్వరా భాస్కర్, నిమ్రత్ కౌర్, గౌరవ్ వాసన్, రవిచంద్రన్ అశ్విన్, సోనమ్ కపూర్, సునీల్ శెట్టి, అతియా శెట్టి తదితరులు వీరికి సహాయం చేస్తామని ఈ వృద్ధ దంపతుల వివరాలు కనుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని కూడా ఈ వీడియో కదిలించింది. బాబాకా డాబాను తాను సందర్శించానని, వారి జీవితాల్లో సంతోషం కోసం తాను చేయగలిగింది చేస్తానని ట్వీట్ చేశారు. 

Leave a Comment