అయోధ్యకు చేరిన భారీ గంట.. మోగిస్తే ‘ఓం’ అనే శబ్దం..!

రామమందిరం కోసం తయారు చేసిన భారీ గంట అయోధ్యకు చేరుకుంది. ఈ గంట బరులు 613 కేజీలు ఉంటుంది. సెప్టెంబర్ 17న తమిళనాడు రామేశ్వరం నుంచి రథయాత్రగా 4500 కిలో మీటర్లు ప్రయాణించి బుధవారం అయోధ్యకు చేరింది.బుల్లెట్ క్వీన్ గా పెరొందిన రాజ్యలక్ష్మి ఈ గంటను ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. ఈ గంట 4.13 అడుగుల పొడవు, 3.9 అడుగుల వెడల్పు ఉంటుంది. 

గంట మోగించినప్పుడు దీని శబ్దం దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకు వినబడుతుందట.. గంట కొడితే టంగ్, టంగ్ అనే శబ్దం కాకుండా ‘ఓం’ అనే శబ్దం ప్రతిధ్వస్తుంది. ఈ విగ్రహంపై రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, వినాయకుడు ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఈ గంటపై జైశ్రీరాం అనే అక్షరాలు రాసి ఉంచారు. రామాలయం నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ భారీ గంటను అమర్చనున్నారు.       

Leave a Comment