ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. 5,905 అంగన్ వాడీ పోస్టులు భర్తీ..

ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ పోస్టుల భర్తీ చేస్తోంది. ఖాళీగా ఉన్న 5,905 పోస్టుల(4,007 అంగన్ వాడీ హెల్పర్లు, 430 మినీ అంగన్ వాడీ వర్కర్లు, 1,468 మెయిన్ అంగన్ వాడీల్లో వర్కర్లు) భర్తీకి ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టారు. ప్రధానంగా అంగన్ వాడీ, మినీ అంగన్ వాడీల్లో వర్కర్లు, హెల్పర్ల పోస్టులు భర్తీ చేస్తున్నారు. దశల వారీగా దరఖాస్తులను ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పోస్టులను భర్తీ చేయగా మరికొన్ని చోట్ల నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి.

రాష్ట్రంలో మెయిన్ అంగన్ వాడీల్లో 48,770 మంది వర్కర్లు ఉండాలి. అయితే ప్రస్తుతం 47,302 మంది మాత్రమే ఉన్నారు. దీంతో1,468 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. మెయిన్ అంగన్ వాడీల్లో 48,770 మంది హెల్పర్లకు బదులుగా 44,763 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 4,007 హెల్పర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. మినీ అంగన్ వాడీల్లో 6,837 వర్కర్లు ఉండాలి. అయితే ప్రస్తుతం 6,407 మంది మాత్రమే ఉన్నారు. దీంతో 430 పోస్టుల భర్తీ జరుగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా పోస్టుల భర్తీ చేపట్టి అర్హుల ఎంపిక నిర్వహిస్తున్నారు. 

పోస్టుల వివరాలు ఇవే.. 

అర్హత – 10వ తరగతి

జీతం – మెయిన్ అంగన్ వాడీల్లో – రూ.11,500

            మినీ అంగన్ వాడీల్లో – రూ.7 వేలు

            హెల్పర్లకు – రూ.7 వేలు

ఖాళీలు – మెయిన్ అంగన్ వాడీల్లో వర్కర్లు – 1,468

               మినీ అంగన్ వాడీల్లో వర్కర్లు – 430

               హెల్పర్లు – 4,007

Leave a Comment