కాలేజీ అమ్మాయితో ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్.. ఎమ్మెల్యేకు 39, అమ్మాయికి 19..!

ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్లో యూత్ చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే వారి పెళ్లిళ్లు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అయితే తమిళనాడులో అధికారప పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కాలేజీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కల్లకూరిచి ఎమ్మెల్యే ప్రభు కాలేజీ చదువుతున్న సౌందర్య అనే యువతితో ప్రేమలో పడ్డారు. ఎమ్మెల్యే వయస్సు 39 ఏళ్లు కాగా, సౌందర్య వయస్సు 19 సంవత్సరాలు..

వీరిద్దరు తియకతురుగంలోని ఎమ్మెల్యే ప్రభు ఇంట్లో సమీప బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి సౌందర్య కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. వారు ఈ వివాహానికి హాజరు కాలేదు. ఎమ్మెల్యే తన కుమార్తెను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరికి 20 ఏళ్ల తేడా ఉందని పెళ్లి కుమార్తె తండ్రి ఆరోపించారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. పెళ్లికి ఒప్పుకోకపోతే మమ్మల్ని చంపుతానని ఎమ్మెల్యే బెదిరించాడని ఆరోపించాడు. 

అయితే ఎమ్మెల్యే ప్రభు కులం, పెళ్లి కుమార్తె సౌందర్య కులం వేరుకావడంతో ఈ పెళ్లికి ప్రాధాన్యత ఏర్పడింది. తమిళనాడులో కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు హత్యలకు గురికావడం, కొందరు ప్రేమికులు మా కులాలు వేరంటూ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇలాంటి సమయంలో కులాంతర వివాహం చేసుకుని ఎమ్మెల్యే ప్రేమికులకు ఆదర్శంగా నిలిచాడు. 

Leave a Comment