వైరల్ వీడియో : 2500 ఏళ్ల క్రితం నాటి మమ్మీ శవపేటిక అన్ సీలింగ్..

ఈజిప్ట్ చరిత్ర ఓ బ్రహ్మాండం. చరిత్రలో ఎన్ని రహస్యాలు అలాగే మిగిలిపోతాయి. మూడువేల ఏళ్ల క్రితం అక్కడి చక్రవర్తులు అంతెత్తున పిరమిడ్ లను కట్టారు. ఆ చక్రవర్తులు వారి దేహాలను పరిరక్షించుకోవడం కోసం అక్కడ దాచుకున్నారు. ఎవరికీ దొరక్కుండా ఎక్కడెక్కడో దాచారు. 

తాజాగా ఈజిప్ట్ లోని సక్కార బావుల లోపల 59 చెక్క శవపేటికలను కొనుగొన్నారు. వాటిలో 2500 సంవత్సరాల క్రితం మూసివేసిన ఒక పురాతన మమ్మీ శవపేటికను పురావస్తు శ్రాస్తవేత్తలు ప్రజల ముందు తెరిచారు. చెక్క పెట్టెలోపల ఒక మమ్మీ ఉంది. ఆ మమ్మీ ఒక అలంకరించబడిన వస్త్రంతో కప్పబడి ఉంది. శవపేటికలను ప్రదర్శన కోసం గిజాలోని కొత్త గ్రాండ్ ఈజిప్టియన్ యూజియంకు తరలించనున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ మమ్మీ వీడియోను కింద చూడండి..

Leave a Comment