అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ, రైనా గుడ్ బై..!

భారత క్రికెట్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోని అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు ధోనీ వెల్లడించారు. అన్ని రకాల ఫార్మెట్లకు ధోనీ గుడ్ బై చెప్పాడు. ధోని తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2019, జులై 19న ప్రపంచకప్ లో న్యూజిలాండ్ తో ఆడాడు.  టీ20, వన్డే ఫార్మాట్లలో భారత్‌కు ధోని వరల్డ్‌ కప్ అందించిన సంగతి తెలిసిందే. తన రిటైర్మెంట్ పై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన అభిప్రాయాలను ధోని పంచుకున్నాడు.

2014లో టెస్టు నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని 350 వన్డేలు, 98 టీ 20 లు ఆడాడు. 350 వన్డేల్లో ధోని 50.57 సగటుతో 10,773 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 98 టీ20ల్లో 1617 పరుగులు చేశాడు.  

ధోని బాటలో రైనా..

ఇక సురేష్ రైనా కూడా ధోని బాట పట్టాడు. ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది సేపటికే తాను కూడా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. రైనా మొత్తం 226 వన్డేలు, 19 టెస్టులు, 78 టీ-10 మ్యాచులు ఆడాడు. వన్డేల్లో 5, టెస్టుల్లో ఒకటి, టీ-20లో ఒక సెంచరీ సాధించాడు. 226 వన్డేల్లో 5615 పరుగులు సాధించాడు. టీ-20ల్లో 78 మ్యాచుల్లో 1600 పరుగులు చేశాడు. 18 టెస్టుల్లో 768 పరుగులు సాధించాడు. ధోని, ఆ వెంటనే రైనా రిటైర్మెంట్ ప్రకటనలతో క్రికెట్ అభిమానులు షాక్ కు గురయ్యారు. 

 

Leave a Comment