నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు..!

నేపాల్ ప్రధాని కెపి శర్మ ఒలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు నేపాలీ అని చెప్పారు. నిజమైన అయోధ్య నేపాల్ లో ఉందని, భారతదేశంలో కాదని చెప్పారు. లార్డ్ రామ్ నేపాలీ అని, భారతీయుడు కాదని వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముని జన్మస్థలం అయోధ్య ఉత్తరప్రదేశ్ లో లేదని, నేపాల్ లోని బీర్బం జిల్లాకు పశ్చిమాన థోరి పట్టణంలో ఉందని ఒలి చెప్పారు. భారతదేశం సాంస్కృతిక ఆక్రమణకు పాల్పడిందని, భారత్ ఒక నకిలీ అయోధ్యను సృష్టించిందని ఆరోపించారు. 

బాల్మికి ఆశ్రమం నేపాల్ లో ఉందని, కొడుకు పుట్టినందుకు దశరథ రాజు యజ్ఞం చేసిన పవిత్ర స్థలం రిడి అని ఒలి పేర్కొన్నారు. దశరథ కుమారుడు రాముడు భారతీయుడు కాదని, అయోధ్య కూడా నేపాల్ లో ఉందని చెప్పారు. ఇప్పటి వరకు సీతను వివాహం చేసుకున్న రాముడు భారతీయుడని నమ్ముతూ వచ్చామని, కానీ ఇది నిజం కాదని ఒలి తెలిపారు. 

భారత్ మరియు నేపాల్ మధ్య కొంత కాలంగా ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. మే 8న ఉత్తరాఖండ్ లోని ధార్చులతో లిపులేఖ్ పాస్ ను అనుసంధానించే 80 కిలోమీటర్ల పొడవైన రహదారిని రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. అయితే ఈ ప్రాంతం నేపాల్ భూభాగంలోకి వస్తుందని నేపాల్ ఉందని చెప్పింది. 

 

Leave a Comment