ఇండియన్ క్రికెటర్ల పేర్లతో రియల్ బిజినెస్..

ప్రపంచంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ మామూలు కాదు. క్రికెటర్లు వాడే ఉత్పత్తులు, బ్రాండ్స్ ఏవైనా ఇట్టే అమ్ముడుపోతాయి. అయితే క్రికెట్ ఆటగాళ్ల పేర్లను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వాడేస్తున్నారు. వారి పేర్లతో రియల్ దందాను నడుపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు రియల్ వ్యాపారులు జిమ్ముక్కులు అలాంటిది. అయితే ఈ జిమ్మిక్కులు ఇండియాలోనే జరుగుతాయనుకుంటున్నారా? ఆస్ట్రేలియాలోనూ జరుగుతుంటాయి. అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం మన ఇండియన్ క్రికెటర్ల పేరుతో అక్కడ ఏకంగా వీధుల పేర్లు పెట్టేశారు. 

మెల్ బోర్న్ వెస్ట్ లోని రాక్ బ్యాంక్ ప్రాంతంలో అకొలేడ్ ఎస్టేట్ ఓ వెంచర్ ని అభివృద్ధి చేసింది. అక్కడ భారత సంతతి ప్రజలు ఎక్కువగా ప్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. అక్కడ స్థలాల విక్రయానికి ఊతమివ్వడానికి మన ఇండియన్ క్రికెటర్లు సచిన్, కోహ్లీ, కపిల్ దేవ్ ల పేర్లను వీధులకు పెట్టేశారు. ‘టెండుల్కర్ డ్రైవ్’, ‘కోహ్లీ క్రెసెంట్’, ‘దేవ్ టెర్రస్’ పేర్లతో బోర్డులు పాతాడు. 

ఇండియన్ క్రికెటర్ల పేర్లే కాదు ‘వా స్ట్రీట్’, ‘మియాందాద్ స్ట్రీట్’, ‘ఆంబ్రోస్ స్ట్రీట్’, ‘సోబెర్స్ డ్రైవ్’, ‘కలిస్ వే’, ‘హ్యాడ్లీ స్ట్రీస్’, ‘అక్రమ్ వే’, ‘నాష్ స్ట్రీట్’ అని కూడా పేర్లు పెట్టారు. అయితే తనకు ఇష్టమైన క్రికెటర్ల పేర్లను కొత్త వెంచర్ వీధులకు పెట్టినట్లు వెంచర్ డైరెక్టర్ ఖుర్రమ్ సయిద్ ప్రకటించాడు. 

 

Leave a Comment