కేవలం రెండు వారాల్లో ఒన్ మిలియన్ దాటిన ‘Remove China Apps’

ప్రస్తుతం దేశంలో ఒక పిలుపు వినబడుతోంది. అనే చైనీస్ ఉత్పత్తులను నిషేధించాలి..దేశంలో చాలా మంది ఈ పిలుపునకు ఆకర్షితులై చైనా ఉత్పత్తులపై ఆధారపడటం మానేశారు. ఇందులో భాగంగా టిక్ టాక్ వంటి ప్రసిద్ధ చైనీస్ యాప్ ను చాలా మంది అన్ ఇన్ స్టాల్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో జైపూర్ ఆధారిత స్టార్టప్ One Touch Apps Lab ‘Remove China Apps’ అనే కొత్త అప్లికేషన్ ను రూపొదించింది. ఈ అప్లికేషన్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. దీనిని ఇప్పటికీ ఒక మిలియన్ మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 

ముఖ్యంగా ఈ యాప్ మీ స్మార్ట్ ఫోన్ ను స్కాన్ చేసి చైనీస్ యాప్స్ ఉంటే వాటిని కునుగొంటుంది. మరియు వాటిని తొలగించేందుకు సరళమైన UIని అందిస్తుంది. ఈ యాప్ మే 17న లాంచ్ చేశారు. అప్పటి నుంచి ఇది ప్రజల నుంచి భారీగా మద్దతు పొంది కేవలం రెండు వారాల్లో ఒక మిలియన్ డౌన్ లోడ్ లను దాటింది. ఈ అప్లికేషన్ కేవలం 3.5 ఎంబీని మాత్రం కలిగి ఉంది. కేవలం చైనీస్ యాప్లను బహిష్కరించేందుకు మాత్రమే ఈ యాప్ ను రూపొందించారు. 

ఈ యాప్ ను ఏవిధంగా ఉపయోగించాలి?

  • మీ స్మార్ట్ ఫోన్ లో ప్లే స్టోర్ నుంచి Remove China Apps ను డౌన్ లోడ్ చేసుకోండి. 
  • ఇన్ స్టాల్ అయిన తర్వాత యాప్ ను ఓపెన్ చేయండి. 
  • అక్కడ Scan China Apps మీద క్లిక్ చేయండి. 
  • నిర్దిష్ట యాప్ ను తొలగించడానికి కుడి వైపున ఉన్న బిన్ చిహ్నంపై క్లిక్ చేయండి. 

 

Leave a Comment