సమతాస్ఫూర్తి కేంద్రంలో ప్రవేశ రుసుం భారీగా పెంపు..!

ఇటీవల హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామానుజాచార్యుల సమతాస్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పటి వరకు సందర్శకుల కోసం ప్రవేశ రుసుం నామమాత్రంగా వసూలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు సందర్శకుల ప్రవేశ రుసుముల ధరలు రూ.50 పెంచారు. ఇప్పటివరకు పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.75 వసూలు చేస్తుండగా.. ఇకపై పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.125 ప్రవేశ రుసుముగా నిర్ణయించినట్లు కేంద్రం నిర్వాహకులు ప్రకటించారు. 

ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రవేశానికి అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. బుధవారం సెలవు కావడంతో సందర్శకులకు అనుమతి ఉండదని ప్రకటించారు. కేంద్రంలో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచే డైనమిక్‌ వాటర్‌ ఫౌంటెయిన్‌ షో నాలుగు ప్రదర్శనలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. దీన్ని లీలా జల నీరాజనం పేరిట నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 4, 6, రాత్రి 8 గంటలకు ప్రదర్శనలు ఉంటాయి.

Leave a Comment