నిరుద్యోగులకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్.. త్వరలో 10 లక్షల ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. కేంద్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు, ఖాళీల వివరాలపై అన్ని శాఖల మంత్రులతో ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో మిషన్ మోడ్ లో పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రధాని మోడీ ఆదేశించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. 

కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం దాదాపు 2 మిలియన్ల ఉద్యోగాలు భర్తీ చేయలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. అంతేకాదు ప్రతి రాష్ట్రంలోనూ ఉద్యోగాల భర్తీపై డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో నిరుద్యోగిత ఒకటి. ఈక్రమంలో దేశంలో నిరుద్యోగ సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నిర్ణయంగా ఇది చెప్పవచ్చు.  

 

Leave a Comment