దాల్చిన చెక్కతో పురుషులకు కలిగే 5 ప్రయోజనాలు ఇవే..!

దాల్చిన చెక్క భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యం.. దీనిని ఎక్కువగా మనం వంటకాలలో ఉపయోగిస్తాము. అయితే మనకు తెలియని మరో విషయం ఏమిటంటే ఈ దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దాల్చిన చెక్కలో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ దాల్చిన చెక్కతో ముఖ్యంగా పరుషులకు కలిగే ఐదు ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దాల్చిన చెక్కతో ప్రయోజనాలు:

  • పురుషులలో అంగస్తంభన సమస్యలకు దాల్చిన చెక్క ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తుంది. అంగస్తంభన సమస్యను అధికమించడానికి పాలలో దాల్చిన చెక్క పొడిని కలిపి రోజూ తీసుకోవాలి. ఈ కొన్ని రోజులపాటు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే చర్మ వ్యాధి ఉన్నట్లయితే వైద్యుని సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. 
  • ఒక కప్పు పాలలో రెండు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడిని కలిపి రాత్రి నిద్రపోయే ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. 
  • మధుమేహం ఉన్న వారికి దాల్చిన చెక్క ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి దాల్చిన చెక్క నీరు లేదా దాల్చిన చెక్క టీని తీసుకోవచ్చు. కీళ్ల నొప్పులు ఉన్న వారు కూడా దాల్చిన చెక్కను పాలతో తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్న వారు మందులు తీసుకున్న వెంటనే దాల్చిన చెక్కను తీసుకోకూడదు. రెండింటి మధ్య కొద్దిగా గ్యాప్ ఉండాలి. 
  • దాల్చిన చెక్క జీవక్రియను పెంచుతుంది. దాల్చిన చెక్క టీని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు జీవ్రక్రియ రేటు కూడా పెరుగుతుంది. నిద్రలేమి సమస్యలు ఉన్న పురుషులకు దాల్చిన చెక్క ఎంతో మేలు చేస్తుంది. నిద్రపోయే ముందు గ్లాస్ పాలలో దాల్చిన చెక్క పొడిని కలిపి తాగిదే మంచి నిద్ర వస్తుంది. మలబద్ధకం సమస్య, అసిడిటీ, గ్యాస్ సమస్యకు ప్రయోజనకరంగా ఉంటుంది. 
  • పురుషులలో సంతానలేమి సమస్యను అధిగమించాలంటే దాల్చిన చెక్క పొడిని ఉదయం, సాయంత్ర గోరు వెచ్చని నీళ్లలో కలిపి తీసుకోవాలి. 

దాల్చిన చెక్కను హోమ్ రెమెడీగా ఉపయోగించవచ్చు. కానీ దీనికి శాస్త్రీయ ఆధారలు లేవు. మీరు ఏదైనా తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నట్లయితే దీనిని తీసుకునే ముందు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.. 

 

Leave a Comment