దేశంలో ఒక్క రోజులో 40 వేల కేసులు..!

భారత్ లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 40,425 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసులు 40 వేలు దాటడం గమనార్హం. కాగా 681 మంది కరోనాతో మరణించారు. 

దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,18,043కు చేరింది. ప్రస్తుతం 3,90,459 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకు కరోనా నుంచి 7,00,087 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనాతో 27,497 మంది మరణించారు.  

దేశంలో గత మూడు రోజుల్లోనే లక్ష కేసులు నమోదయ్యాయి. అంటే దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఇండియాలో కమ్యూనిటీ స్ప్రెడ్ మొదలైందని చెప్పింది. ఇలా అయితే వైరస్ ను కట్టడి చేయడం అసాధ్యమవుతుంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ కి మందు కనుగొనలేదు. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. ఇలాంటి తరుణంలో దేశంలో కరోనా కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. 

Leave a Comment