టీవీ వీక్షకులకు ఇకపై 200 ఛానళ్లు ఉచితం

ఇప్పటి వరకు దేశంలో రూ.130 చెల్లిస్తే 100 ఉచిత ఛానళ్లు మాత్రమే చేసే వెసులుబాటు ఉండేది. ఇప్పుడది 200 ఛానళ్లకు పెరిగింది. ట్రాయ్ కొత్త విధానం ప్రకారం రూ.130 చెల్లిస్తే 200 ఛానళ్లు ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. పాత విధానంలో 100 ఛానళ్లకు పైబడి ఇతర ఛానళ్లు కోరుకుంటే ప్రతి 25 ఛానళ్లకు వినియోగదారుడు పాతిక రూపాయలతో పాటు అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాల్సి వచ్చేది. ట్రాయ్ తాజా నిర్ణయంతో ఇప్పుడా బాధలేదు. 

అంతేకాదు, పెయిడ్ ఛానళ్ల కనీస ధరను రూ.19 నుంచి రూ.12కి తగ్గించారు. తద్వారా పే ఛానళ్ల పరంగానూ వినియోగదారుడిపై భారం తగ్గనుంది. కస్టమర్ కోరుకున్న ఛానళ్లకు స్థానిక కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు విధిగా అందించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఒక ఇంట్లో రెండు కనెక్షన్లు ఉంటే రెండో కనెక్షన్ కు నెట్వర్క్ క్వారియర్ ఫీజులో 40 శాతం మాత్రమే వసూలు చేయాలని ట్రాయ్ స్పష్టం చేసింది. ట్రాయ్ నూతన విధానం మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. 

Leave a Comment