మద్యపాన నిషేధం కఠినంగా అమలు చేయాలి

ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ మరియు వాణిజ్య పన్నుల శాఖా మంత్రి నారాయణస్వామి  

అమరావతి :  మద్య నిషేధం అమల్లో కొత్త సవరణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి  అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన డీసీ, ఏసీ, ఈఎస్, డీఎంలతో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ మద్యపాన నిషేధం అమలు చేయడంలో అవకతవకలకు పాల్పడితే అధికారుల మీద కూడా చర్యలు తప్పదని హెచ్చరించారు. సూపర్ వైజర్, వాచ్ మెన్, సేల్స్ మెన్ లకు ఏజెన్సీల ద్వారా సక్రమముగా జీతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఐడీ, ఎన్ డీపీఎల్ కేసుల్లో పీడీ యాక్ట్ ను కచ్చితంగా అమలు చేయాలన్నారు. మద్యం అక్రమ రవాణా వాహనదారుల యజమానుల మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పారు. 

సీఐ సస్పెండ్..

బెల్ట్ షాపులను ప్రోత్సహించడం, లిక్కర్ ను ఔట్ లెట్స్ నుండి బార్లకు సరఫరా చేసిన కారణంగా నరసరావుపేట సీఐ ఎం.భుజంగరావును సస్పెండ్ చేస్తూ ఈ మేరకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఆదిశేషులుకు ఎక్స్ ప్లనేషన్ మెమో జారీ చేశారు. భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని, ఒకవేళ ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. 

Leave a Comment