కరోనాతో యూపీ మంత్రి కమలా రాణి మృతి

కరోనా వైరస్ సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవ్వరినీ వదలడం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కేబినెట్ మంత్రి కమలా రాణి వరుణ్(62) కరోనాతో మరణించారు. ఆమె లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

కమాల రాణి జూలై 18న కరోనాతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమె ఆక్సిజన్ మరియు వెంటిలేటర్ సహాయంతో ఉన్నారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచారు. ఆమె   మృతి పట్ల యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. కమలా రాణి మరణంతో రామ మందిర ఫౌండేషన్ వేడుక సన్నాహాలను పర్యవేక్షించడనాకి ఆయోధ్య వెళ్లాల్సిన యోగీ ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈమె యోగీ ఆదిత్య నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో సాంకేతిక విద్యా మంత్రిగా పని చేశారు. 

Leave a Comment