ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో అసలు ఏం జరిగిందంటే..?

బాలీవుడ్ స్టార్హీరో అభిషేక్ బచ్చన్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజే డిశ్చార్జ్ అయ్యారు. అయితే గాయ పరిస్థితిపై తిరిగి మరోసారి ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు . 

బాబ్ విశ్వాస్ సినిమాలో నటిస్తున్న అభిషేకం షూటింగ్ సమయంలో గాయపడినట్లు చెబుతున్నారు చెయ్యి ఫ్రాక్చర్ అయింది .ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఇక ఈయన ను చూసేందుకు తండ్రి అమితాబ్బచ్చన్ సోదరి శ్వేతా బచ్చన్ ఆస్పత్రికి వెళ్లారు. వీరు ఆస్పత్రికి వచ్చినప్పుడు ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆస్పత్రికి అభిషేక భార్య ఐశ్వరరాయ్ వచ్చినట్లు మాత్రం సమాచారం లేదు. మరోవైపు అభిషేక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా ద్వారా మెసేజ్లు పెడుతున్నారు.

Leave a Comment