ఏపీలో ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం 

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ఉండటంతో మూతపడ్డ పాఠశాలలు ఆగస్టు 3న ప్రారంభం కానున్నాయి. మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసకున్నారు.  జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాలన్నారు. 9 రకాల సదుపాలను కల్పించాలన్నారు. దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ కూడా విడుదల చేశామన్నారు. జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి కావాలంటే.. కలెక్టర్లు ప్రతిరోజూ రివ్యూ చేయాలని సూచించారు. 

cm jagan

ప్రతి ఏడాది వేసవి సెలవుల అనంతరం జూన్ మొదటి వారంలో పాఠశాలలు ప్రారంభం అయ్యేవి. అయితే ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి కారణంగా పాఠశాలలు ప్రారంభం కావడం ఆలస్యమైంది. ఇప్పుడు సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో పాఠశాలలు రెండు నెలలు ఆలస్యంగా ఆగస్టులో తెరుచుకోనున్నాయి. 

 

Leave a Comment