సెప్టెంబర్ 5న పాఠశాలలు ప్రారంభం : సీఎం జగన్

కరోనా కారణంగా మార్చి నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో పాఠశాలల తెరిచేందుక ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం అవుతాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంపై అధికారులతో ఆయన సమీక్షించారు. 

ఆగస్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని, నాడు-నేడు పనులపై రెండ్రోజులకు ఒకసారి కలెక్టర్ సమీక్ష చేయాలని సీఎం జగన్ సూచించారు. ఇక ఆగస్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, కరోనా ప్రభావం తగ్గాక ‘రచ్చబండ’ ద్వారా గ్రామాల్లో పర్యటిస్తానని,  72 గంటల్లో ఇసుక డెలివరీ చేయలనేది మా లక్ష్యమని జగన్ తెలిపారు.

Leave a Comment