సమంత, నాగచైతన్య విడాకులు.. అధికారికంగా ప్రకటన..!

గత కొన్ని రోజులుగా సమంత, నాగచైతన్య విడిపోతున్నారన్న పుకార్లు షికార్లు చేశాయి. ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే చర్చ.. చివరికి ఆ వార్తలే ఇప్పుడు నిజయమయ్యాయి. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. నాగ చైతన్య తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారిద్దరూ ప్రకటించారు. సమంత కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో విడాకుల విషయాన్ని తెలిపింది.. 

‘నా శ్రేయోభిలాషులందరికీ నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను, సమంత భార్యాభర్తలుగా విడిపోతున్నాం. మా దారులు వేరయ్యాయి. మా ఇద్దరి మధ్య పదేళ్ల పాటు స్నేహబంధం కొనసాగింది. మాబంధంలో అదెంతో ముఖ్యంగా భావిస్తున్నాను. ఈ కష్టకాంలో మీడియా, స్నేహితులు, శ్రేయోభిలాషులు మాకు అండగా నిలవాలని కోరుకుంటున్నాం. మేం ముందుకు వెళ్లడానికి మాకు ప్రైవసీని కల్పించాలని కోరుతున్నాను’ అంటూ నాగచైతన్య ట్వీట్ చేసింది. సమంత కూడా ఈ విసయంపై స్పందిస్తూ చాలా ఆలోచించిన తర్వాత నేను, చైతన్య విడిపోవాలని నిర్ణయించుకున్నామని ప్రకటించింది. దీంతో చాలా కాలంగా నాగచైతన్య, సమంత విడిపోతారని వినిపిస్తోన్న వార్తలకు క్లారిటీ వచ్చింది. 

 

View this post on Instagram

 

A post shared by S (@samantharuthprabhuoffl)

సమంత, నాగచైతన్యలకు ఎక్కడ చెడింది..

ఈ నిర్ణయం ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురిచేస్తోంది.. ఇద్దరి మధ్య ఎక్కడ చెడిందన్న అంశంపై చర్చించుకుంటున్నారు.. సమంత, నాగచైతన్య 2017లో ప్రేమించి పెళ్లి చేసకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా వివాహం జరిగింది. అక్టోబర్ 7తో వీరి వివాహ బంధానికి నాలుగేళ్లు పూర్తవుతాయి. పెళ్లి తర్వాత సమంత ఇంటికే పరిమితమం అవుతుందనుకున్నారు. కానీ సమంత వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. పెళ్లి తర్వాత కూడా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటించింది. ఇటీవల విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ రోల్ రెచ్చిపోయింది. అంతేకాదు ఫొటో షూట్లలో కూడా అందాల ఆరబోతను ప్రదర్శించింది. ఇది కాస్త అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదు. దీనిపై వారు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే సమంత వారి మాటలను లెక్కచేయకుండా ముందుకెళ్లడంతో వ్యవహారం ముదిరినట్లు సమాచారం. 

 

 

Leave a Comment