ఏటీఎంలలో నగదు లేకపోతే బ్యాంకులకు జరిమానా.. ఆర్బీఐ కొత్త రూల్..!

రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలలో డబ్బులు లేకపోతే బ్యాంకులకు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఏటీఎంలలో నగదు అందుబాటులో లేని సమయం నెలకు 10 గంటలు దాటితే.. బ్యాంకులకు ఒక్కో ఏటీఎంకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఈఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని వెల్లడించింది. 

ఏటీఎంలు ఖాళీ అయిన వెంటనే బ్యాంకులు తిరిగి డబ్బు నింపకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈనేపథ్యంలో ఏటీఎంలలో నోట్ల లభ్యతను పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిందిగా బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లను ఆర్బీఐ ఆదేశించింది. వైట్ లేబుల్ ఏటీఎంల విషయంలో సదరు ఏటీఎంలకు సంబంధించిన నగదు అవసరాలు తీర్చే బ్యాంకులే జరిమానా కట్టాల్సి ఉంటుంది. 

 

Leave a Comment