మహేష్ – రాజమౌళి కాంబోలో సినిమా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తర్వాతి సినిమా రాజమౌళితో చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి సిని వర్గాలు. దీనిపై దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు. తన నెక్ట్స్ సినిమా మహేష్ బాబుతో ఉంటుందని వెల్లడించారు. 

ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహేష్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్ ఇది. దీంతో మహేష్ అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది.  

మహేష్ బాబు – జక్కన్న కాంబినేషన్ లో సినిమా చూడాలని తెలుగు చిత్రసీమ కలలు కంటోంది. కానీ ఈ కాంబోకు శ్రీకారం పడలేదు. ఈ న్యూస్ వచ్చిన ప్రతి సారీ సినీ అభిమానుల సంతోషానికి హద్దులు ఉండవు. అయితే అది నిజం కాదని తెలిసి నీరు గారి పోతుంటారు. అయితే ఈ సారి జక్కన్న తన నెక్ట్స్ మూవీ మహేష్ తో అని ప్రకటించడంతో ఆయన దర్శకత్వంలో మహేష్ సినిమా ఎప్పుడు అనే ఉత్కంఠకు తెరపడింది. 

అయితే ప్రస్తుతం రాజమౌళి భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల అవుతోంది. అదే ఏడాది మహేష్ బాబు-పరుశురామ్ సినిమాను పూర్తి చేస్తారు. ఇక వచ్చే ఏడాది  మహేష్-జక్కన్న కాంబో ప్రారంభమవుతుందన్నమాట. 

Leave a Comment