లాక్ డౌన్ పొడిగింపును పరిశీలిస్తున్నాం

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దేశంలో ఇప్పటికి 5 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 167 మంది మరణించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పేరిగిపోతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 4040 కేసులు నమోదు కాగా..11 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పకిటీ 330 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మణించారు. 

ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రాన్ని సూచించాయి. తెలంగాణ అయితే జూన్ 3 వరకు లాక్ డౌన్ ను పొడిగించాలని కోరింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాక్ డౌన్ కు సంబంధించి పలు సూచనలు చేశారు. 

లాక్ డౌన్ పొడిగింపును పరిశీలిస్తున్నామని, రాష్ట్రాలు, నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు లాక్ డౌన్ కి సహకరించాలని కోరారు. ప్రజలెవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. అనవసరపు కారణాలతో రోడ్లపైకి తిరగవద్దని సూచించారు. ‘‘తాజా కూరగాయలు అవసరం లేదు..పప్పుతో తినండి..వారం రోజులకు సర్పడా సరుకులు దగ్గర పెట్టుకోండి..’’ అని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు. 

ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం లాక్ డౌన్ అమలు పరుస్తుందన్నారు. దేశంలో టెస్టింగ్ కిట్ల కొరత లేదని, ఈరోజు రెండు లక్షల కిట్లు వచ్చాయని అన్నారు. ఎక్కడి వారు అక్కడే ఉంటారని, విదేశాల నుంచి వచ్చిన వారు నిర్బంధంలో ఉన్నవారి నిర్బంధం కొనసాగుతుందని చెప్పారు. ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరేళ్లుగా కేంద్రం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదన్నారు. ప్రతిపక్షాల సూచనలను స్వీకరిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

Leave a Comment