ఆన్ లైన్ లో ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడం ఎలా ?

మీరు LICలో ప్రీమియం చెల్లిస్తున్నారా..బ్రాంచ్ కు వెళ్లి బీమా ప్రీమియం చెల్లించడం మీకు ఇబ్బందిగా ఉందా..అయితే మీకోసం ఎల్ఐసీ ఆన్ లైన్ లో ప్రీమియం చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు మీరు ఇంట్లోనే కూర్చొని LIC బీమా ప్రీమియం చెల్లించవచ్చు. లైఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) తన పాలసీ దారులకు ప్రీమియం చెల్లించేందుకు కొన్ని ఆన్ లైన్ ఎంపికలను అందుబాటులోకి తెచ్చింది.

మీరు LIC వెబ్ సైట్ ను సందర్శించి బీమా ప్రీమియం చెల్లించవచ్చు. లేదా LIC INDIA యాప్ ను మీ స్మార్ట్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకుని ఆన్ లైన్ ప్రీమియం చెల్లింపులు చేయవచ్చు. 

LIC వెబ్ సైట్ ద్వారా ప్రీమియం చెల్లించే విధానం..

  • బీమా వెబ్ సైట్ ద్వారా ప్రీమియం చెల్లించడానికి www.licindia.in సైట్ ను సందర్శిచండి. 
  • తర్వాత ‘ఆన్ లైన్ సర్వీసెస్ పోర్టల్’ నుంచి ‘ఆన్ లైన్ ప్రీమియం ఆన్ లైన్’ పై క్లిక్ చేయండి. 
  • ఇక్కడ మీకు రెండు ఎంపికలు లభిస్తాయి. డైరెక్ట్ గా చెల్లించడం(లాగిన్ లేకుండా) మరియు కస్టమర్ పోర్టల్ ద్వారా.

డైరెక్ట్ గా చెల్లించే విధానం..

పోర్టల్ లో నమోదు చేసుకోని వారికి ఇది ఇక ఎంపిక. ఈ ఎంపిక ద్వారా మీరు మూడు రకాల చెల్లింపులు చేయవచ్చు. ప్రీమియం చెల్లింపు / పునరుద్ధరణ, లోన్ తిరిగి చెల్లించడం మరియు లోన్ వడ్డీ తిరిగి చెల్లించడం.

Step 1. ప్రీమియం చెల్లింపు చేయడానికి ‘ప్రీమియం చెల్లింపు’ ఎంపికను ఎంచుకోండి.

Step 2. ప్రీమియం చెల్లింపు విధానాన్ని వివరించే పాప్ -అప్ మీ కంప్యూటర్ స్క్రీన్ లో కనిపిస్తుంది. అక్కడ ‘కొనసాగండి’పై క్లిక్ చేయండి.

Step 3. మీరు పాలసీ నంబర్, వాయిదాల ప్రీమియం (పన్నలను మినహాయింపు) వంటి వివరాలను నమోదు చేయాలి. వివరాలను నమోదు చేసేటప్పుడు, మీరు దీనిని సరిగ్గా మరియు సమయానుసారంగా పేర్కొన్నారని నిర్ధారించుకోండి. లేకపోతే సెషన్ గడువు ముగుస్తుంది. మరియు మీరు ఈ ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలి.

Step 4. తరువావ క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి, I Agree ను ఎంచుకుని, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. 

Step 5. పై దశలలో మీరు పేర్కొన్న వివరాలను ధ్రువీకరించి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. మీరు చెల్లింపులు చేయాలనుకుంటున్న ఒకటి కంటే ఎక్కువ ఎల్ఐసీ పాలసీని కలిగి ఉంటే, అప్పుడు మీరు కిందికి స్క్రోల్ చేయడం ద్వారా పాలసీ నంబర్ మరియు ప్రీమియం మొత్తాన్ని(పన్నులు మినహాయించి) జాబితాకు నమోదు చేయవచ్చు. పూర్తయిన తర్వాత కొనసాగింపు పై క్లిక్ చేయాలి. 

Step 6. తర్వాత దశ ప్రీమియం చెల్లించాల్సిన పాలసీల సంఖ్య మరియు చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం మొత్తాన్ని మీకు చూపుతుంది. చెల్లింపులు చేయడానికి ‘Check & Pay’ పై క్లిక్ చేయండి. 

Step 7. మీకు చెల్లింపు చేయడానికి మూడు ఎంపికలు ఉంటాయి. 1. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇ-వాలెట్లు, క్రిడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డులు,, 2. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ యూపీఐ మరియు 3.యాక్సిస్ పే యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. 

Step 8. మీర దేని ద్వారా చెల్లింపులు చేయాలనుకుంటున్నారో దానిని ఎంపిక చేయాలి. 

కస్టమర్ పోర్టల్ ద్వారా..

మీరు ఇప్పటికే పోర్టల్ లో నమోదై ఉంటే, మీ బీమా చెల్లింపులను చేయడానికి మీ ఖాతాకు లాగిన్ అవ్వచ్చు. లేకపోతే మీరు ముందుగా మీరే నమోదు చేసుకోవాలి. 

పోర్టల్ లో మీరు నమోదు చేసుకోవడానికి ‘సైన్ అప్’ పై క్లిక్ చేయండి. పాలసీ నెంబర్, ప్రీమియం మొత్తం, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ మరియు మీ ఈ-మెయిల్ చిరునామా వంటి తప్పనిసరి వివరాలను నమోదు చేయాలి. 

మీరు ఎల్ఐసీ వెబ్ సైట్ లో సైన్ అప్ అయిన తర్వాత చెల్లింపు చేయడానికి మీ ఖాతాకు లాగిన్ అవ్వండి. 

Step 1. మీ వివరాలు ఎంటర్ చేసి ఖాతాకు లాగిన్ అవ్వండి.

Step 2. లాగిన్ అయిన తర్వాత, ఆన్ లైన్ పేమెంట్ పై క్లిక్ చేయండి. ఇది మీకు ప్రీమియం చెల్లిపు పోర్టల్ కు తీసుకెళ్తుంది. 

Step 3. మీర చెల్లింపులు చేయాలనుకుంటున్న పాలసీలను ఎంచుకోండి మరియు Check & pay పై క్లిక్ చేయండి. 

Step 4. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ మరియు ప్రీమియం మొత్తం వంటి వివరాలను మరోసారి ధ్రువీకరించమని, పోర్టల్ మిమ్మల్ని అడుగుతుంది. వివరాలను ధ్రువీకరించిన తర్వాత Check & pay పై క్లిక్ చేయండి. 

Step 5. మీ లావాదేవీలను పూర్తి చేయడానికి చెల్లింపు గేట్ వేని ఎంచుకోండి.

మీరు డైరెక్ట్ పే లేదా మీ ఖాతా ద్వారా చెల్లించేటప్పుడు  ఛార్జీలను వసూలు చేయడం జరుగుతుంది. ఆ చార్జీల వివరాలు ఇలా ఉన్నాయి. 

చెల్లింపులు చేసేటప్పుడు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు..

  1. సరైన మరియు చెల్లుబాటు అయ్యే మొబైల్ నెంబర్ ఈమెయిల్ చిరునామాను అందించండి.
  2. రసీదు మీ ఈమెయిల్ చిరునామాకు మెయిల్ చేయబడుతుంది.
  3. ఆన్ లైన్ ప్రీమియం చెల్లింపును పాలసీదారుడు స్వయంగా చేయాలి. మూడో పార్టీ చెల్లింపు ఉపయోగించకూడదు. 
  4. ప్రీమియం మొత్తం మీ బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ చేసినప్పుడు error page ప్రదర్శించబడాతే, మీ బ్యాంక్ నుంచి నిర్ధారణ వచ్చిన తర్వాత మూడు పని దినాలలో మీ ఈమెయిల్ చిరునామాకు రసీదు పంపబడుతుంది. అటువంటి సంఘటనను మీరు [email protected] కు నివేదించవచ్చు. 
  5. తిరిగి ప్రయత్నిస్తే –  ముందుగా మీ బ్యాంక్ ఖాతా / కార్డు ఇప్పటికే డెబిట్ చేయబడిందా లేదా మునుపటి లావాదేవీల మొత్తంతో వసూలు చేయబడిందా అని తనిఖీ చేయాలి. డెబిట్ / ఛార్జ్ చేస్తే, మళ్లీ చెల్లించవద్దు. మూడు రోజుల్లో బీమా రసీదు పంపే వరకు వేచి ఉండండి. 
  6. ఆన్ లైన్ పోర్టల్ దేశీయ బ్యాంకులు జారీ చూసిన కార్డులను అంగీకరిస్తుంది. అంతర్జాతీయ బ్యాంకుల కార్డులు అంగీకరించబడవు. 

యాప్ ద్వారా..

పాలసీదారుడు తన ఫోన్లో ఎల్ఐసీ యాప్ ను డౌన్ లోడ్ చేయడం ద్వారా తన పాలసీ ప్రీమియం చెల్లించే అవకాశం కూడా ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యోక్క యాప్ స్టోర్లలో మూడు యాప్ లు అందుబాటులో ఉన్నాయి. Lic Customer, Lic pay direct, my Lic యాప్ల ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు. 

 Lic Customer యాప్..

ఈ యాప్ ను ఉపయోగించడం ద్వారా, పే డైరెక్ట్ ఆప్షన్ ఉపయోగించి లేదా నమోదు చేయడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు. చెల్లింపులు చేసే విధానం వెబ్ సైట్ లో మాదిరిగానే ఉంటుంది. చెల్లింపులు చేయడమే కాకుండా ఎల్ఐసీ ఆఫీస్ లొకేటర్, ప్రీమియం కాలిక్యులేటర్ వంటి ఇతర సేవలను కూడా పొందవచ్చు. 

Lic pay direct యాప్..

ఈ యాప్ ద్వారా పాలసీదారుడు రిజిస్ట్రేషన్ చేయకుండానే పాలసీ ప్రీమియం చెల్లించవచ్చు. ఈ యాప్ ను ఉపయోగించి లావాదేవీ స్టేట్మెంట్లను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

my Lic యాప్..

ఇది Lic Customer, Lic pay direct యాప్లకు లింక్ ను అందించే Lic యాప్ స్టోర్. పాలసీదారుడు ఈ యాప్ ద్వారా ప్రీమియం చెల్లించడానికి పైన పేర్కొన్న యాప్లను ఇన్ స్టాల్ చేయాలి.

ECS ద్వారా చెల్లింపులు..

పాలసీదారునికి Licకి ECS ఆదేశాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంది. దీని కింద, ప్రీమియం నిర్దిష్ట తేదీన పాలసీదారు యొక్క రిజిస్టర్డ బ్యాంక్ ఖాతా నుంచి స్వయంచాలకంగా తీసివేయబడుతుంది. ECS ఆదేశం కోసం నమోదు చేయడానికి మీరు రద్దు చేసిన చెక్ మరియు పాలసీ వివరాలతో పాటు శాఖను సందర్శించాలి. 

 

Leave a Comment