కొన ఊపిరితో ఉన్న చిన్నారికి.. నోటి ద్వారా ఆక్సిజన్ అందించి కాపాడిన డాక్టర్..!

రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించే దేవుడి రెండో రూపమే డాక్టర్.. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న నవజాత శిశువుకు ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించింది ఆగ్రాకి చెందిన లేడీ డాక్టర్.. ఆక్సిజన్ యంత్రం పనిచేయకపోవడంతో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న శిశువుకు నోటి ద్వారా ఆక్సిజన్ అందించి బతికించింది. దాదాపు ఏడు నిమిషాల పాటు పాప నోటిలోకి గాలి ఊది ఆమె ప్రానాలు కాపాడింది. 

బుర్జ్ గంగి గ్రామానికి చెందిన ఓ మహిళ ఈనెల 1న ఆగ్రా జిల్లాలోని ఎత్మాద్ పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆక్సిజన్ అందక శిశువుకు ఇబ్బందిగా ఉందని వైద్యులు గుర్తించారు. శిశువును ఆక్సిజన్ అందించాలని ప్రయత్నించారు. కానీ ఆక్సిజన్ పరికరం సరిగ్గా అదే సమయంలో పనిచేయలేదు. 

దీంతో సురేఖ్ చౌదరి అనే మహిళా వైద్యురాలు వెంటనే తన నోటి ద్వారా శిశువుకు ఆక్సిజన్ అందించింది. ఏడా నిమిషాల పాటు శిశువు నోటిలోకి గాలి ఊదారు. ఆ తర్వాత శిశువు ఏడవడం మొదలుపెట్టింది. దీంతో తల్లిదండ్రులు, వైద్య సబ్బంది హర్షం వ్యక్తం చేశారు. గతంలో చాలా మంది పసి బిడ్డలను కాపాడేందుకు తాను ఇదే టెక్నిక్ ను ఉపయోగించినట్లు వైద్యురాలు సురేఖ చౌదరి చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది..   

Leave a Comment