కార్గిల్ విజయ్ దివాస్ : వీరుల త్యాగానికి 22 ఏళ్లు..!

1999 జూలై 26న దయాది పాకిస్తాన్ ఉగ్రవాద ముసుగులో కశ్మీర్ ను కబళించేందుకు చేసిన కుటిల ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టింది. ఎల్ ఓసి వద్ద భారత్ భూభాగంలో ప్రవేశించిన పాక్ ముష్కరులకు, భారత సైనికులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంగా భారత సైనికులు పాకిస్తాన్ ముష్కరులను సమర్థవంతంగా ఎదుర్కొని మట్టికరిపించాయి. ఈ యుద్ధంలో చాలా మంది భారత సైనికులు వీర మరణం పొందారు. ఈక్రమంలో దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన సైనికులను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ నిర్వహించుకుంటాము..

కార్గిల్ విజయ్ దివాస్ 21వ వార్షికోత్సవ వేడుకలను సోమవారం ద్రాస్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ద్రాస్ సెక్టార్ కు వెళ్లాల్సి ఉండగా, పర్యటన చివరి నిముషంలో రద్దయింది. వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన రద్దయినట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. 

కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్ కే మాథుర్, ఎంపీ జమ్ యాంగ్ సెరింగ్ యుద్ధవీరులకు నివాళులర్పించారు. రావత్ విజయ జ్యోతిని వెలిగించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా, నేవీ వైస్ చీఫ్ అడ్మిరల్ జి.అశోక్ కుమార్ అమరవీరులకు అంజలి ఘటించారు. 

ప్రధాని మోడీ నివాళి:

కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికలగా ఘన నివాళులర్పించారు. సైనికుల త్యాగాలు మరువలేనివని, దేశం కోసం ప్రానాలు పణంగా పెట్టిన అమర వీరులను భారతజాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కొనియాడారు.  

 

Leave a Comment