‘జెర్సీ’ సినిమా అరుదైన ఘగత – అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఎంపిక

నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్దా శ్రీనాథ్ నటించింది. ఈ సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. 

జెర్సీ సినిమా తెలుగులో ఘన విజయం సాధించింది. ఈ సినిమా హిందీ రీమెక్ హక్కులను కూడా పొందింది. ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి 15 వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో జెర్సీ చిత్రం ప్రదర్శన చేస్తారు. ఈ వేడుక కెనడాలో జరగనుంది. టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపిక కావడం పట్ల చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ సంతోషం వ్యక్తం చేశారు. 

 

Leave a Comment