విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలని పిటిషన్..!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నటి తమన్నాతో కలిసి ‘ఆన్ లైన్ జూదం’ను ప్రమోట్ చేస్తున్నందుకు చర్యలు తీసుకోవాలని చెన్నైకి చెందిన ఓ లాయర్ కోర్టు మెట్లు ఎక్కాడు. ఆన్ లైన్ జూదం యాప్స్ ను బ్యాన్ చేయాలని, దీని వల్ల యువతపై చెబు ప్రభావం పడే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఆగస్టు 4న మద్రాస్ హైకోర్టు విచారణ జరపనుంది. 

గ్యాంబ్లింగ్ యాప్స్ ను బ్యాన్ చేయాలని ఆ న్యాయవాది కోరారు. యువకులు ఈ యాప్స్ కు బానిసలవుతున్నారన్నారు. కోహ్లీ, తమన్నా వంటి స్టార్లు ఇటువంటి యాప్స్ లను ప్రమోట్ చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి యాప్స్ ను వీరు ప్రమోట్ చేయడం ద్వారా యువకులు జూదానికి ఆకర్శితులవుతున్నారన్నారు. 

 

Leave a Comment