టెక్నాలజీ మన జీవితాలను చాలా సులభతరం చేసింది. మనక ఏది కావాలన్నా ఆన్ లైన్ ఇట్టే జరిగిపోతున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో అయితే టెక్నాలజీ ద్వారా చాలా ఈజీగా పనులు అయిపోతున్నాయి. ఆన్ లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పనులు చాలా సులువుగా జరిగిపోతున్నాయి.
మీరు ఏటీఎంకు వెళ్లకుండానే ఫోన్ లో మినీ స్టేట్మెంట్ తెలుసుకోవాలనుకుంటున్నారా. అయితే ఈ పోస్టులో రిజిస్ట్రేషన్ ప్రొసెస్, ఫోన్ లో మినీ స్టేట్మెంట్ పొందడం, ఏటీఎం కార్డును బ్లాక్ చేయడం వంటి ఎస్టీఐకి సంబంధించిన మరింత ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తున్నాము.
ఎస్బీఐ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
మీరు బ్యాంకుకు సంబంధించిన ఎటువంటి సేవలను పొందాలన్నా మీ మొబైల్ నెంబర్ ను బ్యాంక్ లో రిజిస్ట్రేషన్ అయిందని నిర్ధారించుకోవాలి. అప్పుడే మీరు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. మీరు ఇప్పటికే మీ మొబైల్ నెంబర్ ను బ్యాంకులో నమోదు చేసుకొని ఉంటే, మీరు తర్వాతి సెక్షన్ వెళ్లవచ్చు.
ఒకవేళ బ్యాంకులో మీరు ఫోన్ నెంబర్ నమోదు చేయకపోతే, సింపుల్ గా ఒక SMS పంపడం ద్వారా చేయవచ్చు. దాని కోసం కింద స్టెప్ ను అనుసరించండి.
REG<space>account number
ఈ SMSను 09223488888 నంబర్ కు పంపాలి. ఇలా చేయడం ద్వారా మీ ఫోన్ నెంబరును బ్యాంకులో సులభంగా నమోదు చేసుకోవచ్చు. తరువాత ఇతర సేవలను ఉపయోగించుకోవచ్చు.
Missed Call లేదా SMS ద్వారా బ్యాలెన్స్ వివరాలు పొందడం ఎలా?
మీ అకౌంట్ లో బ్యాలెన్స్ తెలుసుకునేందుకు మీరు కేవలం 09223766666 నంబర్ కు డయల్ చేయండి. ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలంటే ‘BAL’ అని టైప్ చేసి అదే నెంబర్ కు SMS చేయాలి. ఈ రెండు పద్ధతులను ఉపయోగించి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు మీ అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు పొందవచ్చు.
Mini Statement పొందడం ఎలా?
మీ ఫోన్లో మినీ స్టేట్మెంట్ పొందడానికి 09223866666 నెంబర్ కు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. SMS ద్వారా పొందాలనుకుంటే మీరు అదే నెంబర్ కు ‘MSTMT’ అని టైప్ చేసి 09223866666 నెంబర్ కు SMS చేయండి. మీ మినీ స్టేట్మెంట్ వివరాలు మీకు మెసేజ్ రూపంలో వస్తాయి. పై రెండు పద్ధతులను ఉపయోగించి మీ అకౌంట్ యొక్క మినీ స్టేట్మెంట్ ను తెలుసుకోవచ్చు.
ATM కార్డును బ్లాక్ చేయడం ఎలా?
మీరు ఏటీఎం కార్డును కోల్పోయారా.. దానిని ఎలా బ్లాక్ చేయాలో తెలీదా? అయితే ఆ వివరాలను ఇప్పుడు మీకు అందిస్తున్నాం. ఇందు కోసం మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా 567676 నెంబర్ కు BLOCK<space>xxxx అని టైప్ చేసి SMS చేయాలి. వెంటనే మీ ఏటీఎం బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ xxxx అంటే మీ కార్డు నెంబర్ యొక్క చివరి నాలుగు అంకెలు. వీటిని మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.