మీకు పీఎం కిసాన్ యోజన డబ్బులు రాలేదా? అయితే ఇలా చెక్ చేసుకోండి..

PM Kisan Samman Nidhi List 2020

కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు పీఎం కిసాన్ యోజన కింద ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించింది. దేశంలోని 9 కోట్ల మంది రైతులను ఆదుకునేందుకు నెలకు రూ.2 వేలు చొప్పున మూడుల నెలల పాటు రూ.6వేలు ఇవ్వనుంది. ఈ డబ్బును  ఏప్రిల్-జూలై నెలలో వాయిదాల రూపంలో కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఈ డబ్బులు మీ అకౌంట్ లో జమా అయిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

పీఎం కిసాన్ సమ్మాన్ యోజన యాప్..

రైతుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మొబైల్ యాప్ ను కూడా విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా రైతులందరూ ఈ పథకంలో ఈజీగా కనెక్ట్ కావచ్చు. ఈ యాప్ ద్వారా రైతులు ఈ పథకం కింద ఎన్ని వాయిదాలు పొందారు తెలుసుకోవచ్చు. ఎవరైన రైతులు పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోకపోతే వారు  కూడా ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

How to Check PM Kisan Samman Nidhi Status 2020 

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్టేటస్ ను చెక్ చేసుకోవడానికి కింది స్టెప్ప్ అనుసరించడండి. 

  •   పీఎం కిసాన్ యొక్క అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లండి. దానికి కోసం ఇక్కడి ఇచ్చిన లింక్ https://pmkisan.gov.in/ పై క్లిక్ చేయండి. 

  • తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ Former Corner అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. 

  • అక్కడ మీకు Benificiary Status అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. 

  • అక్కడ మీకు ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్ మరియు ఫోన్ నెంబర్ మూడు ఆప్షన్ కనిపిస్తాయి. అందులో ఏదో ఒక దానిపై టిక్ చేసి దానిని ఎంటర్ చేయాలి. 
  • అక్కడ మీరు పీఎం కిసాన్ నిధి జమ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు.
  • ఒక వేళ ఈ వివరాలు ఏమీ లేకుండా ఉంటే Former Corner వద్ద క్లిక్ చేస్తు Benificiary List అని ఉంటుంది. 
  • దాని మీద క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా, మీ ఊరు ఎంటర్ చేస్తే ఎంత మంది లబ్ధిపొందారనే వివరాలను మీరు తెలుసుకోవచ్చు.

Leave a Comment