మొబైల్ నెంబర్ ను ఆధార్ కు లింక్ చేయడం ఎలా?

How to Change Mobile Number in Aadhar Card..

వివిధ సేవలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి. ఎటువంటి ఆన్ సేవలను పొందాలన్నా ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ చేసి ఉండాలి. ఇదే కాకుండా ప్రభుత్వం నుంచి జారీ చేసిన పత్రాలను పొందడానికి, డిజిటల్ సేవలను పొందడానికి ఆధార్ కు మొబైల్ లింక్ ఉంటే సులభంగా చేసుకోవచ్చు. అయితే కొన్ని కారణాల వల్ల మన మొబైల్ నెంబర్ ను కోల్పోతే లేదా ఫోన్ నెంబర్ మార్చినప్పుడు ఈ ఆన్ లైన్ సేవలను పొందలేదు. మీ మొబైల్ నెంబర్ను UIDAI యొక్కడేటా బేస్ లో అప్డేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆధార్లో మొబైల్ నెంబర్ ను ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం.. 

How to Change Mobile Number in Aadhar Card

  • మొదటగా మన దగ్గరలోని ఆధార్ ఎన్ రోల్మెంట్ సెంటర్ కు వెళ్లాలి.
  • అక్కడ Aadhar Update/Correction Formను నింపాలి. 
  • ఆధార్ ఎగ్జిక్యూటివ్ కు దీనిని సమర్పించాలి.
  • రూ.30 సర్వీస్ చార్జ్ ను చెల్లించాలి.
  • మీకు అప్డేడ్ రిక్వెస్ట్ నెంబర్ కలిగిని రసీదు వస్తుంది. దీనిని ఉపయోగించి మీ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. 
  • మూడు నెలలలోపు మీ ఫోన్ నెంబర్ ఆధార్ డేటా బేస్ లో అప్ డేట్ అవుతుంది.

Steps to Add/Update Mobile Number in Aadhar Card

మీ మొబైల్ నంబర్‌ను మీ ఆధార్ కార్డుకు లింక్ చేసి UIDAI లో నమోదు చేసుకోవచ్చు. మీ ఆధార్‌కు సంబంధించిన అన్ని మెసేజ్ లు మరియు OTP లు ఈ మొబైల్ నంబర్‌కు పంపబడతాయి. ఆధార్‌తో మీ మొబైల్ నంబర్‌ను ఎలా జోడించవచ్చో తెలుసుకుందా.

  • మొదటగా మన దగ్గరలోని ఆధార్ ఎన్ రోల్మెంట్ సెంటర్ కు వెళ్లాలి.
  • అక్కడ Aadhar Enrolment Formను నింపాలి. 
  • తర్వాత మీ మొబైల్ నెంబర్ ను ఫారంలో నమోదు చేయాలి.
  • ఆధార్ ఎగ్జిక్యూటివ్ కు దీనిని సమర్పించాలి.
  • మీ బయోమెట్రిక్ లను అందించాలి. దీని ద్వారా మీ వివరాలు ప్రామాణీకరించండి. 
  • ఇక్కడ మీర ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన పని లేదు.
  • రూ.30 సర్వీస్ చార్జ్ ను చెల్లించాలి.
  • ఒకవేళ మీరు నమోదు సమయంలో మీ మొబైల్ నంబర్‌ను పేర్కొన్నట్లయితే, మీరు మళ్లీ నమోదు చేయవలసిన అవసరం లేదు.

 

Leave a Comment