Video Viral: కూరగాయల్లా కరోనా వ్యాక్సిన్.. వీధుల్లో తిరుగుతూ ‘వ్యాక్సిన్ వేయించుకోండి’ అంటూ..

ప్రభుత్వం, అధికారులు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని ఎన్ని విధాలుగా ప్రచారాలు చేసినా ప్రజలు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రజలు ఇప్పటికీ సంకోచిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రోత్సహించడానికి ఎన్ని ప్రకటనలు చేసినా ప్రజలు మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో కరోనా వ్యాక్సిన్ చివరికి ఇళ్ల ముందు, రోడ్డుపై పాలు, కూరగాయల మాదిరిగా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ జరిగిందో తెలీదు.. కానీ హెల్త్ సిబ్బంది వీధుల్లో తిరుగుతూ ‘కరోనా వ్యాక్సిన్..ఫస్ట్ డోసు.. సెకండ్ డోసు వేయించుకోని వారు వేయించుకోండి’ అంటూ అరుస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. 

 గుజరాత్ లోని ఓ బస్ స్టాప్ వద్ద ఓ వ్యక్తి ‘కరోనా వ్యాక్సిన్..కరోనా వ్యాక్సిన్’ అంటూ కూరగాయల విక్రేత మాదిరిగా అరుస్తున్నాడు. ‘ప్రతి ఒక్కరూ టీకా వేసుకున్నారు.. మీరు మాత్రం మిగిలిపోయారు. ఇది కరోనా టీకా.. ప్రాణాలు కాపాడే టీకా’ అంటూ ఈ వ్యక్తి ప్రజలను పిలుస్తున్నాడు. 

Leave a Comment