ఈ పాప మానవత్వానికి సెల్యూట్.. నిండు గర్భిణీని కాపాడిన చిన్నారి.. వీడియో వైరల్..!

ఎవరికైనా సహాయం చేయాలంటే మనసు ఉండాలి. రోడ్డుపై ఎవరైనా ఆపదలో ఉంటే మనకెందుకులే అని వెళ్లే వారు చాలా మంది ఉంటారు. కానీ మానవత్వంతో స్పందించేవారు కొందరే ఉంటారు. అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ చిన్నారి మానవత్వంతో స్పందించింది. అందుకే అంటారు చిన్న పిల్లలది కల్మషం లేని మనసు లేని. ప్రస్తుతం ఆ చిన్నారి పాప చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వీడియోలో ఏముందంటే.. రోడ్డుపై ఒక ఆటో పంక్చర్ అయి ఉంది. దీంతో డ్రైవర్ టైర్ మారుస్తున్నాడు. అంతో ఆటోలో కూర్చున్న ఒక నిండు గర్భిణీ ప్రసవవేదనతో అల్లాడుతోంది. ఆటో పంక్చర్ కావడంతో ఆస్పత్రికి వెళ్లడానికి దారిలేదు. ఆ గర్భిణీ నొప్పితో కేకలు వేయడంతో ఆటో డ్రైవర్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. రోడ్డుపై నిలబడి సాయం కోసం వచ్చే వాహనాలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఎవరూ స్పందించలేదు. చాలా వాహనాలు అటుగా వెళ్లాయి. కానీ ఎవరూ సాయం చేయడానికి ముందుకురాలేదు. 

కొద్ది సేపటికి అటుగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ఆటో ముందు నుంచి వెళ్లింది. అంతలోనే మళ్లీ వెనక్కి వచ్చింది. కారులోనుంచి చిన్న పాప స్కూల్ యూనిఫాంలో దిగింది. ఆటో దగ్గరికి వెళ్లి చూసింది. కారులోంచి నీళ్ల బాటిల్ తీసుకుని ఆ మహిళకు ఇచ్చింది. వెంటనే కారు వద్దకు వెళ్లి తన కుటుంబ సభ్యులను తీసుకొచ్చింది. ఆ గర్భిణీని ఆటోలోనుంచి దించి కారులో కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్తుతంది. 

దీనికి సంబంధించిన వీడియోను ధరమ్ వీర్ మీనా అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ లో సేర్ చేశారు. ‘ఈ పాపకు సెల్యూట్..సరైన వయస్సులో సరైన విలువలను నేర్పించిన ఆమె తల్లిదండ్రులకు ఇంకా పెద్ద సెల్యూట్’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మానవత్వం ప్రదర్శించిన చిన్నారిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Leave a Comment