ఒక స్టార్ మాదిరి నాటకాలాడొద్దు..

కనికా కపూర్ పై డాక్టర్ ఆగ్రహం

కరోనా పాజిటివ్ కనబడిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పై లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ ఐఎంఎస్ హాస్పిటల్ డాక్టర్ ఆర్.కె.ధీమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక స్టార్ మాదిరి నాటకాలాడొద్దని, రిగాలా ఆస్పత్రి సిబ్బందికి సహకరించి ఉండాల్సిందని ఆయన ఆమెను మందలించారు. ఐలోలేషన్ లో ఉన్నప్పుడు ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పించామని, ఆమెకు కేటాయించిన ప్రత్యేక గదిలో శుభ్రమైన టాయిలెట్, పేషంట్ బెడ్, టీవీ ఉన్నాయని పేర్కొన్నారు. వెంటిలేషన్ కూడా ఎయిర్ కండిషన్ తో కూడుకున్నదన్నారు. ఆమెకు సప్లయి చేసిన ఫుడు కూడా హాస్పిటల్ కిచెన్ లో స్పెషల్ గా తయారు చేసిందని ఆయన పేర్కొన్నారు. కాని కనిక కపూర్ రోగి మాదిరి కాకుండా తనో పెద్ద స్టార్ లా వ్యవహరించిందని డాక్టర్ ధీమన్ అసహనం వ్యక్తం చేశారు. 

మార్చి 11న లండన్ నుంచి లక్నో చేరుకున్న కనికా కపూర్ కి కరోనా పాజిటి్ లక్షణాలు ఉండటంతో నిబంధనల ప్రకారం స్వయంగా ఐసోలేషన్ కి వెళ్లాల్సిందిగా అధికారులు ఆమెకు సూచించారు. అయితే ఆ సలహాలను పక్కనబెట్టిన ఆమె ..తన సొంత కార్యక్రమాల్లో నిమగ్నమైంది. తన రొగాన్ని దాచిపెట్టినందుకు ఆమెపై లక్నో పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆమె ఇచ్చిన డిన్నర్ కి అనేక మంది బడా పొలిటిషియన్లు, సెలబ్రిటీలు హాజరైన సంగతి తెలిసిందే.. వీరిలో బీజేపీ నేత, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే సింధియా, ఆమె కుమారుడు దుశ్యంత్ సింగ్ కూడా ఉన్నారు. అయితే వీరికి కరోనా టెస్టులు నిర్వహించినా అనంతరం నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. 

Leave a Comment