మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?

ప్రస్తుతం మారుతున్న జీవన విధానం, ఉద్యోగ శైలి, అందుబాటులో వాష్ రూమ్స్ లేకపోవడంతో మూత్ర విసర్జన కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా మారుతుంటుంది. ఇక జర్నీ సమయంలో, లేదా మీటింగ్ లలో ఉన్నప్పుడు, వాష్ రూమ్ దూరంగా ఉందిలే.. తర్వాత వెళ్దాం అని కొందరు  మూత్రవిసర్జనకు వెళ్లకుండా ఎక్కువ సేపు ఆపుకేనే ప్రయత్నం చేస్తారు. ఇక మహిళలు అయితే బయటికి వచ్చినప్పుడు మూత్ర విసర్జనకు ఫెసిలిటీ ఉండదు. దీంతో వారు రోజంతా అలానే ఆపుకుని ఉంటారు.  అయితే ఇలా చేస్తే చాలా ప్రమాదకరమైని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే అనారోగ్యాలను మీ శరీరంలో దాచుకున్నట్లే అని చెబుతున్నారు. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటే కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం..

మూత్రం ఎక్కవ సేపు ఆపుకుంటే కలిగి దుష్ప్రభావాలు.. 

  • మనిషి జీవన క్రియలో మూత్ర విసర్జన ఒకటి.. ఇందులో మూత్రాశయం కీలక పాత్ర పోషిస్తుంది. మనం మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే మూత్రాశయంపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. దీంతో మూత్రాశయంలో ఉండే కండరాలు బలహీనంగా మారుతాయి. 
  • మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 
  • మూత్రం అంటేనే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాల సమాహారం.. అలాంటి మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటే శరీరంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. 
  • మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే కిడ్నీలలో రాళ్లు తయారయ్యే ప్రమాదం ఉంది. వైద్యుల సూచన మేరకు కనీసం రెండు గంటలకు ఒకసారైనా మూత్ర విసర్జన చేస్తే మంచిది.. 

Leave a Comment